|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:58 PM
‘కన్నప్ప’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచు విష్ణు చేసిన సాహసమని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీనిపై పరుచూరి స్పందిస్తూ.. 'విష్ణు తలచుకుంటే ఎన్నో హిస్టారికల్, పీరియాడికల్ సినిమాలు చేయొచ్చు. కానీ, శివుడి కథను అందించాలనుకున్నారు. తక్కువగా నిడివి ఉన్న పాత్రను అంగీకరించి చేయడం ప్రభాస్ గొప్పతనం' అని అన్నారు.
Latest News