![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 09:18 PM
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆమె కుటుంబ సభ్యులు వీక్షించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమె కోసం ప్రత్యేకంగా ఈ మూవీని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘ రాష్ట్రపతి మా చిత్రాన్ని చూశారు. సినిమాపై ఆమె చూపిన ఆదరణ మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ప్రశంసలు మాకు విలువైనవి’ అని టీం పేర్కొంది.
Latest News