![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 05:08 PM
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపుని నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ఎక్కడ తడబడకుండా డాన్సులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనువైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ఆయన ఇప్పుడు రాబోయే సినిమాలతో కూడా గొప్ప విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ కి మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సినిమా యూనిట్ అనుకున్న టైం కి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక 2026 సంక్రాంతి కానుక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేకంగా నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. వైవిద్య భరితమైన సినిమాలను చేయడంలో నాగార్జున దిట్ట…నాగార్జునకి చిరంజీవికి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. వీళ్లిద్దరి మధ్య బ్రదర్స్ రిలేషన్ షిప్ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అనే వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్య రూపం దాల్చలేదు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఇ వి వి సత్యనారాయణ ఒక భారీ సబ్జెక్ట్ ని చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ఇద్దరి స్టార్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే విధంగా కథ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…ఇకమీదట ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న ఇద్దరు సీనియర్ హీరోలు వాళ్ళు అనుకున్న విధంగా సక్సెస్ సాధిస్తారా? లేదా వాళ్ళ అభిమానులను ఆనందపరిచే సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Latest News