![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 04:53 PM
విష్ణు ఎన్నో ఆశలతో నిర్మించిన 'కన్నప్ప' చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు విష్ణు కి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోలేదు. ఆయన సోలో హీరో గా ఒక సినిమా చేస్తే బయ్యర్స్ కనీసం పది కోట్ల రూపాయలకు అయినా ఆ సినిమాని కొనుగోలు చేస్తారో లేదో తెలియదు. అలాంటి హీరో ఒక కథ ని మనస్ఫూర్తిగా నమ్మి 200 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ఈ సినిమాని తెరకెక్కించడం ని కచ్చితంగా అందరూ మెచ్చుకోవలసిందే. కావాల్సినంత హైప్ క్రియేట్ చేయకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకి అయినా ఈమధ్య కాలం లో బిజినెస్ అవ్వడం లేదు. మంచు ఫ్యామిలీ కి గత దశాబ్ద కాలంగా పడిన ఫ్లాప్ సినిమాల కారణంగా వాళ్ళని నమ్మి ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఓటీటీ సంస్థలు కూడా మంచు విష్ణు కోరినంత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఓటీటీ హక్కులను కూడా అమ్మకుండా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు మంచు విష్ణు. ఇలాంటి డేరింగ్ అడుగు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ నిర్మాత కూడా వెయ్యలేదు. ఓటీటీ డీల్స్ లాక్ అవ్వకపోతే నెలల తరబడి సినిమాలు థియేట్రికల్ విడుదల చేయడానికి ఒప్పుకోని నిర్మాతలు మన టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లో విడుదల తర్వాత నా సినిమా పెర్ఫార్మన్స్ ని చూసి కొనుక్కోండి అంటూ మంచు విష్ణు డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడంటే ఈ సినిమా స్క్రిప్ట్ పై ఆయనకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం అవుతుంది. ఇక థియేట్రికల్ రిలీజ్ ఒక్క చోట కూడా అవుట్ రైట్ కి అమ్ముడుపోలేదు. ప్రతీ సెంటర్ లోనూ కమీషన్ బేసిస్ మీద వచ్చిన డబ్బులే నిర్మాత, బయ్యర్ పంచుకోవాలి. ఫ్లాప్ అయితే బయ్యర్ కి పైసా నష్టం లేదు. అతని కమీషన్ అతనికి వచ్చేస్తుంది. కానీ నష్టపోయేది మాత్రం కచ్చితంగా మంచు విష్ణు నే. ఇలా రిస్క్ మొత్తం తన నెత్తిన వేసుకొని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. నిర్మాణ సమయం లో ఎన్నో సవాళ్లు వచ్చాయి. వాటిని విజయవంతంగా ఎదురుకొని ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం లో కచ్చితంగా ఎదో మ్యాటర్ ఉందని అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాస్పతి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే వేరే లెవెల్ ట్రెండ్ ఉంటుందని ఆశిస్తున్నారు నెటిజెన్స్.
Latest News