![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 01:04 PM
నటి శృతిహాసన్ ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయింది. 7.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్‌ని క్రిప్టో కరెన్సీ బ్యాచ్ టార్గెట్ చేసి హ్యాక్ చేసింది. అందులో బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు కనిపించాయి. వీటిని చూసిన నెటిజన్లు షాకయ్యారు. శ్రుతిహాసన్ ఇలాంటి పోస్టులు ఎందుకు చేసిందా అని చర్చ మొదలుపెట్టారు. దీనిపై శ్రుతిహాసన్ స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది ‘ హాయ్ లవ్లీస్ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు తెలియజేస్తున్నారు. అది నేను చేసిన పోస్ట్ కాదు. తిరిగి నా అకౌంట్ రికవరీ చేసుకునే వరకు దయచేసి ఆ పేజీలో ఎవరూ చాట్ చేయొద్దని మనవి చేస్తున్నా’ అని చేతులెత్తి దండం పెట్టే ఎమోజీతో పాటు హార్ట్ సింబల్ షేర్ చేసింది.
Latest News