|
|
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 02:16 PM
తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో అరెస్టైన నటుడు శ్రీరామ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నటుడు కృష్ణపై పోలీసులు దృష్టి సారించారు. విచారణకు హాజరైన తర్వాత పరారైన కృష్ణ కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, టాలీవుడ్ నటులతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Latest News