|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 03:17 PM
ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రం సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన సమీక్షను పంచుకున్నారు. 'ధురంధర్' భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేస్తుందని, చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఇది ఏ భాషలో తెరకెక్కిందనేది ముఖ్యం కాదని, భారతీయ సినిమాగా ప్రతి ప్రేక్షకుడి మనసును హత్తుకుంటుందని, వినోదంతో పాటు మనసులను గెలుచుకోవడం చిత్రబృందం సాధించిన విజయమని వర్మ ప్రశంసించారు.
Latest News