|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 01:59 PM
‘పుష్ప 2’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టాకీ పార్ట్ 40 శాతం పూర్తయింది. అయితే, VFX పనికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇటీవల అల్లు అర్జున్ చూసిన కొన్ని సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, వచ్చే వారం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తుండగా, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రష్మిక మందాన కీలక విలన్ పాత్రలో కనిపించనుంది.
Latest News