|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:23 PM
'వారణాసి' సినిమా ష్యూటింగ్ కు ఇంకా 7-8 నెలల సమయం పడుతుందని రాజమౌళి తెలిపారు. ఇటీవల హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ 'అవతార్ 3'ను ముందుగా చూసిన రాజమౌళితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో కామెరూన్ 'వారణాసి' సినిమా గురించి ఆసక్తి చూపించి, షూటింగ్ చూడటానికి రావచ్చా అని అడిగారు. రాజమౌళి దీనికి సంతోషంగా స్పందిస్తూ, కామెరూన్ రావడం భారతీయ సినిమాకు గర్వకారణమని చెప్పారు. కామెరూన్ సరదాగా 'పులులతో షూటింగ్ ప్లాన్ చేస్తే చెప్పండి, నేను వచ్చి షూట్ చేస్తాను' అని వ్యాఖ్యానించారు.
Latest News