|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:50 PM
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం సాధారణం అయిపోయింది. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ సీనియర్ నటుడు షిజు ఏఆర్ చేరారు. 17 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ స్టా వేదికగా ప్రకటించాడు. 'ప్రీతి నేను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. మీడియా, స్నేహితులు మా గోప్యతను గౌరవించాలని, రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని కోరుతున్నాను' అని తెలిపారు. షిజు 'దేవి' సినిమాతో పరిచయమై, సింహరాశి, నువ్వు నాకు నచ్చావ్, శతమానం భవతి వంటి చిత్రాల్లో నటించారు.
Latest News