|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:52 PM
నటి నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 'ది రాజా సాబ్' సినిమాలోని 'సహన సహన' పాట విడుదల కార్యక్రమానికి బుధవారం ఆమె హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. దీంతో తీవ్రమైన తోపులాట జరిగి, ఆమె కారు ఎక్కేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ ఘటనతో నిధి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న బౌన్సర్లు ఎంతో కష్టపడి ఆమెను సురక్షితంగా కారు వద్దకు చేర్చారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీడియోలలో, జనసమూహం మధ్య నుంచి తన వాహనం వైపు వెళ్లేందుకు నిధి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కారులోకి ఎక్కిన వెంటనే ఆమె ఊపిరి పీల్చుకుని "దేవుడా, ఏంటిది అసలు?" అని వ్యాఖ్యానించింది.
Latest News