|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:09 PM
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ 'ది రాజాసాబ్' జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. 'సహనా.. సహనా..' పాటను విడుదల చేయడంతో పాటు, జనవరి 8న స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. త్వరలోనే హైదరాబాద్ ఓపెన్ గ్రౌండ్స్‌లో 'ది రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Latest News