|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:41 AM
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో, అభిమానులు 'పుష్ప 3' కోసం ఎదురుచూస్తుండగా, బన్నీ-సుకుమార్ కాంబోలో 'పుష్ప' ఫ్రాంచైజీకి సంబంధం లేని ఒక సరికొత్త సినిమా రాబోతోందని సమాచారం. సుకుమార్ ఈసారి యునీక్ స్టోరీ లైన్, హై ఎండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బన్నీని విభిన్న అవతారంలో చూపించనున్నారని తెలుస్తోంది. 'పుష్ప 3'ని ఒక 'బ్రహ్మాస్త్రం' లాగా, భవిష్యత్తులో క్లిష్ట పరిస్థితుల్లో వాడుకోవడానికి రిజర్వ్ లో ఉంచాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్.
Latest News