![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:11 PM
‘ది రాజాసాబ్’ తో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు నటి మాళవికా మోహనన్ ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక తాజాగా ఎక్స్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. తన తదుపరి సినిమా విశేషాలు, ఇష్టాయిష్టాలు పంచుకున్నారు. ప్రభాస్ గురించి ఆమె మాట్లాడారు. ‘ది రాజాసాబ్’ వల్ల ప్రభాస్ గురించి తాను ఎంతో తెలుసుకున్నానని అన్నారు.ప్రభాస్‌ని కలవక ముందు.. పలు ఇంటర్వ్యూల్లో ఆయన్ని చూసి తను ఇతరులతో పెద్దగా కలవరనుకున్నా. చాలా సైలెంట్‌గా ఉంటారనిపించింది. కానీ, ఈ సినిమా వల్ల ఆయన విషయంలో నా ఆలోచన తప్పని అర్థమైంది. ఆయన ఎంతో సరదాగా ఉంటారని.. అద్భుతంగా మాట్లాడతారని తెలుసుకున్నా. ఆయన ఉన్నారంటే సెట్ ఎంతో సరదాగా ఉంటుంది. ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు’’ అని మాళవికా మోహనన్ తెలిపారు. ఈ సినిమా టీజర్ అతిత్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
Latest News