![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:14 PM
శాకుంతలం ప్లాప్ తర్వాత బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ "యుఫోరియా" అనే కొత్త యూత్ ఫుల్ సోషల్ డ్రామాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖితా యలమాంచాలి, అడ్డాల పృధివి రాజ్, కల్పలత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం సమకాలీన దురాచారాలపై ఉద్వేగభరితమైన మరియు వేగవంతమైన టేకింగ్, మరియు ఇది ప్రకటించినప్పటి నుండి ఉత్సుకతను పెంచింది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఫ్లై హై అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో లాంచ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కాల భైరవ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి కిట్టు విస్సా లిరిక్స్ అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో భూమికా చావ్లా కూడా కీలక పాత్ర పోషించింది. చిత్ర సాంకేతిక బృందంలో ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీని, ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు మరియు యువ సంగీత సంచలనం కాల భైరవ సంగీతాన్ని అందించారు. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News