|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:09 PM
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల సందడి చేశారు నటి జాన్వీకపూర్. తొలిసారి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమా ప్రీమియర్ ఇక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబయికి చేరుకున్న ఆమె కేన్స్ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ సినిమా ప్రీమియర్‌ను తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అన్నారు. ప్రీమియర్ తర్వాత తన కుటుంబసభ్యులను కలవాలనుకోలేదని ఆమె చెప్పారు. అందుకు బలమైన కారణం ఉందన్నారు.హోమ్‌బౌండ్’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ‘కేన్స్’లో దానిని ప్రదర్శించగా విశేష ఆదరణ లభించింది. ప్రీమియర్ పూర్తయ్యే సమయానికి హాల్‌లో ఉన్న వారందరూ భావోద్వేగానికి గురయ్యారు. దూరం నుంచి మా నాన్నను చూశా. సినిమా చూసి ఆయన ఎమోషనల్ అయ్యారని అర్థమైంది. ఎంతో బాధగా కనిపించారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన్ని నేనెప్పుడూ ఆవిధంగా చూడలేదు. నా సోదరి ఖుషి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ సమయంలో నేను వారి వద్దకు వెళ్తే.. తప్పకుండా నన్ను పట్టుకుని ఏడ్చేస్తారనిపించింది. వాళ్లను ఓదార్చలేననిపించింది. అందుకే వాళ్ల వద్దకు అప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదనిపించింది’’ అని జాన్వీకపూర్ చెప్పారు.
Latest News