|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:25 AM
బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ నెల 31 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది.'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా అంతకుమించిన విజయాన్ని నమోదు చేసింది. ఈ నెల 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో 13వ స్థానంలో నిలవడం విశేషం. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ ప్రీక్వెల్‌లో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.
Latest News