|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 10:34 PM
నటుడు మరియు టీవీకే పార్టీ నేత విజయ్ కరూర్ తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించారు. మహాబలిపురంలోని రిసార్ట్‌లో 37 బాధిత కుటుంబాలను కలిసేలా వెట్రి కజగం నేతలు ఏర్పాట్లు చేసారు.ఈ సందర్భంగా విజయ్ బాధితులను పరామర్శించి వారితో కలిసి భోజనం చేశారు. బాధితులకు విద్య, స్వయం ఉపాధి, గృహ నిర్మాణం, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు మహాబలిపురం చేరినందుకు విజయ్ క్షమాపణలు తెలిపారు.అధికారుల అనుమతి లేకపోవడంతో కరూర్‌కి రాలేకపోయానని తెలిపారు. కానీ త్వరలో కరూర్‌కు రాగానే వారి కుటుంబాలను కలుస్తానని హామీ ఇచ్చారు. దాదాపు మూడుగంటల పాటు వ్యక్తిగత సమావేశం జరిగింది. ఆయన, తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను తన సొంత కుటుంబంలా చూసుకుంటానని పేర్కొన్నారు.సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు నిర్వహిస్తోంది.
Latest News