|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:06 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘ఫౌజీ’ సినిమా ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి అనే కొత్త నటి హీరోయిన్‌గా ఎంపికైంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇమాన్వి.. క్లాసికల్, మోడ్రన్ స్టెప్పులను కలిపి చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించిన ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కామెంట్స్ సెక్షన్‌లో ‘ప్రభాస్ జోడీకి పర్ఫెక్ట్ ఛాయిస్’ అని, ‘నెక్స్ట్ సీతారామం గర్ల్’ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Latest News