|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:05 PM
హారర్ కామెడీ జోనర్ నుంచి చాలా సినిమాలు బరిలోకి దిగిపోతున్నాయి. ఈ తరహా సినిమాలు కొన్ని విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఆ సినిమాలను చూడటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి సినిమాల జాబితాలోకి 'సుమతి వలవు' చేరిపోయినట్టుగా చెబుతున్నారు. అర్జున్ అశోకన్ ప్రధానమైన పాత్రను పోషించిన మలయాళ మూవీ ఇది. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మాళవిక మనోజ్ ..గోకుల్ సురేశ్ .. బాలు వర్గీస్ .. సైజూ కురుప్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 1వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 26వ తేదీనుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అడవిని ఆనుకుని ఉన్న ఒక విలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథ ఆసక్తికరంగా కొనసాగుతుంది.
Latest News