|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:03 PM
మలయాళీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్, సుమారు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రంలో అను ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో ఆమె రీఎంట్రీపై ఆసక్తి మొదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగులో దాదాపు పది సినిమాల్లో నటించిన అను ఇమ్మాన్యుయేల్‌కు 'మజ్ను' మినహా చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, నాని, నాగచైతన్య వంటి అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ, ఆమెకు హిట్లు మాత్రం దక్కలేదు. చివరిగా రవితేజ 'రావణాసుర' చిత్రంలో కనిపించిన ఆమె, ఆ తర్వాత తెలుగులో మరో సినిమా అంగీకరించలేదు. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలోనూ 'జపాన్' సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టులోనూ కనిపించలేదు. అయితే ఇప్పుడు 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో 'దుర్గ' అనే బోల్డ్ క్యారెక్టర్‌తో ఆమె సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అను పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని తెలుస్తోంది.
Latest News