|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:07 PM
టాలీవుడ్ నటుడు చిరంజీవి తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొన్ని వెబ్‌సైట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి, తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల (పోర్న్) వీడియోలను సృష్టిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.చిరంజీవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్లు 67, 67ఏ, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 79, 294, 296, 336(4)తో పాటు పలు ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. తన పేరు, ఫొటోలు, పోలికలను ఉపయోగించి కొన్ని వెబ్‌సైట్లు ఏఐ టెక్నాలజీతో నకిలీ అశ్లీల వీడియోలను రూపొందించి, ప్రచురించి, ప్రచారం చేస్తున్నాయని చిరంజీవి ఆరోపించారు. ‘మీనాక్షి’ అనే మహిళతో పాటు ఇతరులతో తాను అసభ్యకరమైన లైంగిక చర్యలలో పాల్గొన్నట్లుగా ఈ వీడియోలను సృష్టించారని ఆయన తెలిపారు.
Latest News