|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 04:37 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మరియు మన శంకర వరప్రసద్ గారు అనే ప్రాజెక్ట్స్ లో పని చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి యొక్క కొత్త చిత్రం తాత్కాలికంగా 'మెగా 158' పేరుతో ప్రకటించబడింది. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ కోలీవుడ్ నటుడు కార్తీ ని సంప్రదించినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. నటుడు ఈ చిత్రంలో ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News