|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 07:45 AM
శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పెద్ద సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', రవితేజతో చేస్తున్న 'మాస్ జాతర' చిత్రాలపై ఉన్నాయి.ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీలీల అప్పుడప్పుడు పలు షోలలో పాల్గొనడంతో పాటు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో శ్రీలీల వివరించారు.ప్రధానంగా తనకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా ఫర్వాలేదని, కానీ తనను ఎక్కువగా అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలని చెప్పారు. అంతేకాకుండా తన సినీ కెరీర్‌కు అతను మద్దతుగా ఉండటంతో పాటు తనను మంచిగా చూసుకోవాలని, తనతో సరదాగా ఉండాలని, అన్నింటికీ మించి నిజాయితీగా ఉండాలని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కలిసినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని శ్రీలీల స్పష్టం చేశారు.తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలపై నటి శ్రీలీల ఈ విధంగా చెప్పడంతో, ఇన్ని రకాల మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రస్తుత సమాజంలో దొరకడం సాధ్యమేనా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
Latest News