|
|
by Suryaa Desk | Sun, Oct 26, 2025, 03:05 PM
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) నూతనంగా ఎన్నికైన సభ్యులు నిన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు సంస్థ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చిరంజీవికి వివరించారు. ప్రధానంగా సినీ జర్నలిస్టుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలు అమలులో ఉన్నాయని, ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని టీఎఫ్‌జేఏ సభ్యులు తెలిపారు. అలాగే భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు.ఈ సందర్భంగా వారి కార్యక్రమాల గురించి తెలుసుకున్న చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులను అభినందిస్తూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
Latest News