|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 03:31 PM
టాలీవుడ్ యువ నటుడు రోషన్ కనకాల ఒక విభిన్నమైన ప్రేమ మరియు యాక్షన్ డ్రామా 'మోగ్లీ 2025' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ సయ్యారే అనే తొలి పాటను ఆవిష్కరించారు. మరిచిపోలేని ప్రేమకథను ఈ పాట చిత్రీకరిస్తుంది. ఇది కేవలం అడవిలో జరిగే యాక్షన్ డ్రామా కాదు. ఇది త్యాగం మరియు షరతులు లేని ప్రేమ కథ. కాల భైరవ కంపోస్ చేసిన ట్యూన్ మనోహరంగా ఉంది. ఐశ్వర్య దరూరితో పాటు కల భైరవ తన గాత్రాలని అందించారు. చంద్రబోస్ ఈ చిత్రానికి గంభీరమైన సాహిత్యాన్ని రాశారు. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్, హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు. రామమూర్తి, పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద TG విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్‌లు ఈ సినిమాని నిర్మించారు.
Latest News