|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 08:06 PM
తాను కార్ రేసింగ్ చిత్రాల్లోనూ నటిస్తానని ప్రముఖ కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ తాజాగా వెల్లడించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఎఫ్1 స్వీకెల్ వంటి చిత్రాల్లో తనకు నటించాలని ఉందన్నారు. తన సినిమాల్లో తానే స్వయంగా స్టంట్స్ చేస్తానని అజిత్ తెలిపారు. హాలీవుడ్ నుంచి పిలుపు వస్తే, రేసింగ్ మూవీస్‌లోనూ అజిత్ నటిస్తానన్నారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంతో తన ఫాన్స్‌ను అలరించారు.రేసింగ్ నేపథ్యంలో సాగే కథలు హాలీవుడ్‌లో ఎక్కువగా వస్తుంటాయి. భారత్‌లోనూ ఈ తరహా మూవీస్‌ను ప్రయత్నించినా పెద్దగా వర్కవుట్ కాలేదు. మరి ఇప్పుడు అజిత్ కోరిక ఎవరైనా దర్శకుడు స్క్రిప్ట్‌తో వస్తారేమో చూడాలి. స్వతహాగా అజిత్ రేసర్ కావడం, బైక్ స్టంట్స్ డూప్ లేకుండా చేయడం వంటివి కలిసొచ్చే అంశాలు.
Latest News