![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 03:07 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. రియాల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్ల సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు, రియాల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉండటం సంచలనం సృష్టిస్తోంది. వీరితో పాటు ప్రముఖ యాంకర్ల ఫోన్ నెంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్లిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్‌ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది.తాజాగా స్టార్ యాంకర్ అనసూయ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో అనసూయ ఫోన్‌ను సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇలాంటి ధృవీకరణ లేకపోవడంతో ..ఇది కేవలం ప్రచారం మాత్రమే అని భావిస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను లాగారనే టాక్ నడుస్తోంది.ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ లిస్ట్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ఇక నటి పవిత్ర లోకేశ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలుస్తోంది. అసలు ఆమె ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు.దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
Latest News