|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:55 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ 171 చిత్రంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కలయికలో బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న చిత్రం కూలీ. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, షౌబిన్, సత్యరాజ, శృతిహాసన్ వంటి సౌత్ ఇండియా సూపర్ స్టార్లు కీలక పాత్రలు పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ నిర్మించింది. అగష్టు 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. రెండు రోజుల్లో చికిటు అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సంగీత దర్శకుడు అనిరుద్ కారులో దిగి వాచ్‌లు ఉన్న దండను చేతిలో పట్టుకుని డెన్‌లోకి వెళ్లిన వీడియోను రిలీజ్ చేశారు. 25 బుధవారం ఈ సినిమా పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ రూ. 80 కోట్ల వరకు భారీ ధర పలుకుతూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
Latest News