|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:54 PM
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు, పేరున్న నటీనటులు ఎవరూ లేకుండా ఇటీవల థియేటర్లకు వచ్చిన లో బడ్జెట్ చిత్రం ఎక్స్ రోడ్స్ (X ROADS). నాటి గులాబీ ఫేమ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ రచించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని సంచలనం నమోదు చేసింది. 90 వెబ్ సిరీస్ ఫేమ్ స్నేహాల్ కామత్ లీడ్ రోల్ లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మే 30న పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలై ఇప్పటికీ ఒకట్రెండు స్క్రీన్లలో ప్రదర్శితమౌతోంది. క్రియేటివ్ స్పీసెస్ ఆధ్వర్యంలో ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మాణ సారధ్యంలో దుష్యంత్ రెడ్డి సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం విజయోత్సవ సభ సోమవారం నిర్వహించారు.
Latest News