|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 11:41 AM
సూర్య హీరోగా నటిస్తున్న తాజా సినిమాకు టైటిల్ ‘కరుప్పు’ అని మేకర్స్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి దర్శకుడిగా అర్‌జే బాలాజీ వ్యవహరిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో సూర్యకి ఇది మరొక ఆసక్తికర పాత్రగా ఉండబోతుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్, షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ కూడా మేకర్స్ తెలియజేయనున్నారు.సూర్య- ఆర్‌జే బాలాజీ ప్రాజెక్ట్‌కు 'కరుప్పు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఏడాది చివరలో కరుప్పు విడుదల కావచ్చని సమాచారం. రేటియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆర్‌జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన నటుడు, గాయకుడు మాత్రమే కాదు, దర్శకుడిగానూ కొలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్‌తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరో సూర్యతోనే ఛాన్స్ దక్కించుకుని హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు.