|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 12:28 PM
అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న విడుదలైంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో సినిమాను చూశారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజామున మొదటి ఆట వేశారు. దీంతో సినిమా టాక్ ఏంటి అనేది సోషల్‌మీడియా ద్వారా టాక్ బయటకు వచ్చేసింది. కుబేరలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతిచోట కుబేర హిట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్‌మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ రన్ అవుతుంది..? నాగార్జున, ధనుష్ పాత్రలు మెప్పించాయా..? అనేది చూద్దాం శేఖర్ కమ్ముల అండ్ టీం బ్లాక్ బస్టర్‌ని అందించారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఫస్టాప్ అదిరిపోయింది అంటూనే సినిమా ప్రాణం, ఆత్మ అంతా సెకండ్ హాఫ్‌లోనే ఉందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ సీన్ పట్ల ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు. ధనుష్ మాత్రమే చేయగలిగే పాత్ర అంటూ అభినందిస్తున్నారు. కుబేరలో ధనుష్ ఒక చిరస్మరణీయమైన నటనను కనబరిచాడని, అతను బిచ్చగాడి పాత్రలో జీవించాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. కథలో అత్యంత బలంగా ఉన్న పాత్ర నాగార్జునకు దక్కిందని మరికొందరు తెలుపుతున్నారు. ఇందులో రష్మిక కూడా మరో చిరస్మరణీయమైన పాత్రను పోషించిందని కాంప్లీమెంట్స్ దక్కుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందట. చాలా సీన్లకు ఆయన ప్రాణం పోశారని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల రచన, దర్శకత్వం చాలా బాగా వర్కౌట్ అయ్యాయని ప్రేక్షకులు తెలుపుతున్నారు. మొత్తం మీద, కుబేరుడు సినిమా అంతటా బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. సినిమా నిడివి మాత్రమే మైనస్ అంటూనే ఎక్కడా కూడా బోర్ కొట్టదు అంటున్నారు. సినిమా మొత్తం ధనుష్ హైజాక్ చేశాడని, ఇంత అద్భుతంగా ఎలా నటించావ్ బాస్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఏకంగా 9 రేటింగ్ ఇస్తున్నారు. కొందరైతే 10 ఇవ్వొచ్చు అంటున్నారు. అంతలా ధనుష్ మెప్పించాడని తెలుపుతున్నారు. సినిమా చూసిన ధనుష్ అభిమానులైతే చాలా ఎమోషనల్ అవుతున్నారు. కన్నీళ్లు తెప్పించే సీన్లు చాలా ఉన్నాయంటూ కుబేరకు నేషనల్ అవార్డ్ తప్పకుండా వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Latest News