|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:51 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ రామోజీ ఫిలిం సిటీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయ్యానని, 'నేను షూటింగ్ చేసిన ప్రదేశాల్లో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి. భయంతో రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు. అక్కడి నుంచి వెళ్లిపోవడం బిగ్ డీల్ లా అనిపించేది. తిరిగి ఎప్పుడూ అక్కడికి రాకూడదని అనుకునేదాన్ని. హైదరాబాద్ లోని రామోజీరావు స్టూడియోని ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది వరల్డ్ లోనే అత్యంత భయంకరమైన ప్రదేశం. అలాంటివి రెండు మూడు ప్రదేశాలు ఉన్నాయి. భగవంతుడు నాకు ఏమి జరగకుండా చూసుకున్నాడు అని భావిస్తున్నా'' అంటూ కాజోల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నిత్యం సినిమా షూటింగులతో, టూరిస్టులతో కళకళలాడుతూ ఉండే ప్రదేశాన్ని కాజోల్ హాంటెడ్ ప్లేస్ గా అభివర్ణించడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె అసౌకర్యంగా భావించినంత మాత్రాన ప్రపంచంలోనే భయానక ప్రదేశం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 'బాహుబలి' 1 & 2, 'పుష్ప' 1 & 2, RRR, 'సలార్', 'కల్కి 2898 ఏడీ' లాంటి ప్రతిష్టాత్మక సినిమాల షూటింగులు జరిగాయని.. 'జవాన్' 'పఠాన్' లాంటి బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
Latest News