|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:07 PM
కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ మొదట్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది.వెంటనే ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన అవకాశం కొట్టేసింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు దక్కాయి. ఈ అమ్మడు అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు. కాగా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకులు పోటీ పడ్డారు. టాలీవుడ్ మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్ను షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టింది.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి మాస్ స్టెప్పులేసి దుమ్మురేపింది. కిస్సిక్ అంటూ కునుకు లేకుండా చేసిందనడంలో అతిశయోక్తిలేదు. చివరగా ఈ సెన్సేషనల్ హీరోయిన్ రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. నితిన్ సరసన నటించిన ఈ అమ్మడు యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీరితో పాటుగా.. ఈ మూవీలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.
ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిగత విషయాల్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సేషనల్ బ్యూటీ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ''మీ శాంతిని కాపాడుకోండి'' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన క్యూట్ వీడియో పంచుకుంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
Latest News