|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 09:11 PM
తమిళ హీరో ధనుష్ హీరోగా, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కుబేర బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. కాగా ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది, ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది.అంతేకాక, ఆయన చివరి రెండు సినిమాలు సూపర్ హిట్‌లుగా నిలిచాయి. అదే విధంగా, నాగార్జున కూడా చివరగా నా సామి రంగ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ధనుష్ గురించి చెప్పనవసరం లేదు, ఆయన వరుస సినిమాలతో హిట్లు కొడుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రష్మిక మందన్న కూడా “లక్కీ లెగ్” అని పేరు తెచ్చుకుని, బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇలా వీరందరూ కలిసి చేసిన ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.
Latest News