![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 03:56 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం ఓబుళాపురం మైనింగ్ కేసు లో సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను చంచల్‌గూడ జైలులో అనుభవిస్తున్నారు.తాజాగా, జైలులో తనకు మరిన్ని వసతులు కల్పించాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో ఉంది.తనయుడు కిరీటి ను హీరోగా పరిచయం చేస్తూ 'జూనియర్' అనే సినిమా రూపొందుతోంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించగా, సాయి కొర్రపాటి నిర్మాణ సంస్థలో రజని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా, జెనీలియా , రవిచంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, కె.కె. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. యాక్షన్ పార్ట్‌లను పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేశారు.పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలకు సన్నాహాలు జరుపుతున్న ఈ చిత్రాన్ని జూలై 18, 2025 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒకవైపు తండ్రి గాలి జనార్దన్ రెడ్డి జైలులో ఉండగా, మరోవైపు కొడుకు కిరీటి నటించిన సినిమా జాతీయ స్థాయిలో విడుదలకానుండడం హాట్ టాపిక్‌గా మారింది.
Latest News