|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 03:38 PM
ముంబైలో బుధవారం జరిగిన ఓ ఈవెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "ఎవరికీ యుద్ధం కావాలని ఉండదు. కానీ, ఒక్కోసారి వేరే ఆప్షన్ ఉండదు. అలాంటి టైంలో తప్పదు. యుద్ధం చేయాల్సిందే. మన సైనిక దళాలకు, ప్రధానికి, మొత్తం ప్రభుత్వానికి నా సెల్యూట్. వాళ్లు చేయాల్సింది బాగా చేశారు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను" అని అన్నారు.పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులతో విరుచుకుపడింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది.
Latest News