|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 03:25 PM
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' లో కనిపించనున్న సంగతి అందరికి తెలిసిందే. అతను షారూఖ్ ఖాన్ స్థానంలో డాన్ గా నటిస్తున్నాడు, ఇది సోషల్ మీడియాలో చాలా చర్చలకు దారితీసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లో రణవీర్ సింగ్ సెప్టెంబర్ 2025లో జాయిన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో యువ నటి షార్వారీ వాగ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఫర్హాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ మస్సెయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News