|
|
by Suryaa Desk | Sat, Oct 07, 2023, 02:58 PM
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు’ చిత్రం రెండు భాగాలుగా రానుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు క్రిష్ కూడా ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథనాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్, విక్రమ్‌జిత విర్క్, నోరా ఫతేహి కీలక పాత్రధారులు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఎంరత్నం నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగతసింగ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క వారాహి విజయయాత్ర కొనసాగిస్తున్నారు.
Latest News