|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 07:53 PM
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు సినిమా రంగంలోకి అడుగుపెట్టనున్నారు. నటుడు సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్, ప్రభాస్ నటించనున్న 'ఫౌజీ' సినిమాలో చిన్ననాటి ప్రభాస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం దర్శన్ వేదాలు నేర్చుకుని, కష్టపడి శిక్షణ పొందారని సుధీర్ బాబు తెలిపారు. 'ఫౌజీ' సినిమా 2026 ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇమాన్వీ, చైత్ర జె ఆచార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Latest News