|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 08:27 PM
ఓటీటీలో కొత్త సినిమా సందడి మొదలైంది. అప్పుడే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అలా మంగళవారం (నవంబర్ 4) అర్ధరాత్రి నుంచి ఒక కొత్త సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.ఇది ఆషామాషీ సినిమా కాదు. ఈ ఏడాది అత్యంత వివాదాస్పద చిత్రాల్లో ఇది కూడా ఒకటి. టీజర్‌తోనే ఈ సినిమా ఎన్నో వివాదాలను రేపింది. ఇందులో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని కామెంట్లు వినిపించాయి.అందుకు తగ్గట్టే థియేటర్లలో రిలీజ్‌కి ఈ సినిమా అనేక అడ్డంకులు ఎదుర్కొంది. ముఖ్యంగా సెన్సార్ బోర్డు కూడా దీనికి బిగ్ షాక్ ఇచ్చింది. సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలకు కట్ చెప్పింది. ఆ తర్వాతే ఇది థియేటర్లలో విడుదలైంది.అయినా ఈ తరం యువతతో బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా పెద్ద స్క్రీన్‌పై మంచి ఆదరణ పొందింది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోయినా, యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు.కథ విషయానికి వస్తే రమ్య అనే అమ్మాయి ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే కట్టుబాట్లలో పెరిగిన రమ్యకు, ఇతర అమ్మాయిలలాగే తనకూ ఓ బాయ్‌ఫ్రెండ్ కావాలనే కోరిక ఉంటుంది. స్కూల్‌లో ఒకరిని, కాలేజీలో మరొకరిని, ఉద్యోగం చేస్తూ ఇంకొకరిని ప్రేమిస్తుంది. కానీ వివిధ కారణాల వల్ల వీరందరితోనూ విడిపోతుంది.దీంతో అయోమయ స్థితిలో పడిన రమ్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఆమెపై "బ్యాడ్ గర్ల్" అనే ముద్ర ఎందుకు పడింది? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పక చూడాలి.ఈ బోల్డ్ అండ్ కాంట్రవర్సియల్ మూవీ పేరు “బ్యాడ్ గర్ల్.”ప్రముఖ దర్శకులు వెట్రిమారన్ మరియు అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని వర్ష భరత్ తెరకెక్కించారు. ఇందులో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో, శరణ్య రవిచంద్రన్ కీలక పాత్రలో నటించారు.థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.“బ్యాడ్ గర్ల్” ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Latest News