|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:27 PM
ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ హీరోలు రవితేజ, నవీన్ పోలిశెట్టి కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ అందించనున్నారని, ఇద్దరు హీరోలు కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. వీరిద్దరి కాంబోపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Latest News