|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 03:56 PM
ఎప్పటినుంచో చర్చలో ఉన్న ‘వేతన అసమానత’ అంశంపై నటి ప్రియమణి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కథానాయకులతో పోలిస్తే తనకు తక్కువ పారితోషికం లభించిన సందర్భాలు ఉన్నప్పటికీ, తాను డబ్బు కంటే పాత్రలకే ఎక్కువ విలువ ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నిజం చెప్పాలంటే, నా కెరీర్‌లో చాలాసార్లు నా సహనటుల కంటే తక్కువ పారితోషికం తీసుకున్నాను. కానీ ఈ విషయం నన్ను ఎప్పుడూ బాధపెట్టలేదు. ఎందుకంటే నేను డబ్బు కోసం సినిమాలు చేయను. నాకు పాత్ర నచ్చితే, అది ఎంత చిన్నదైనా సంతోషంగా ఒప్పుకుంటాను. సాధారణంగా స్టార్‌డమ్‌ను బట్టి పారితోషికం నిర్ణయిస్తారు, దాన్ని నేను గౌరవిస్తాను. అయితే ఒక పాత్రకు నేను అర్హురాలినని నాకు అనిపించినప్పుడు మాత్రం కచ్చితంగా డిమాండ్ చేస్తాను. కానీ అనవసరంగా రెమ్యూనరేషన్ పెంచమని అడగను. నటన వల్లే ప్రేక్షకులు మనల్ని గుర్తుంచుకుంటారు కానీ, మన పారితోషికం వల్ల కాదు” అని ప్రియమణి వివరించారు.
Latest News