|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 02:42 PM
మెగాస్టార్ చిరంజీవి నటించిన కల్ట్ క్లాసిక్ 'ఖైదీ' విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయ్యాయి. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ చిత్రం, చిరంజీవిని స్టార్‌డమ్ శిఖరాలకు చేర్చింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పరిచూరి బ్రదర్స్ రాసిన ఈ కథ 1982 హాలీవుడ్ మూవీ ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా తెరకెక్కింది. రూ.25 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.4 కోట్లు వసూలు చేసి అఖండ హిట్‌గా నిలిచింది. 100 రోజులు 20 కేంద్రాల్లో, 365 రోజులు 2 కేంద్రాల్లో ప్రదర్శించబడింది. ఈ సినిమా మొదట కృష్ణ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. చిరంజీవి టీమ్ స్పెషల్ వీడియో విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News