|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 01:48 PM
‘లెజెండ్’, ‘పండగ చేస్కో’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సొనాల్ చౌహాన్, అమెజాన్ ప్రైమ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ సినిమా వెర్షన్‌లో కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సొనాల్ తన సోషల్ మీడియాలో “ఈ గేమ్‌చేంజింగ్ ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉంది. ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’ నా కెరీర్‌లో ప్రత్యేక మైలురాయి” అని పేర్కొంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా, గ్యాంగ్ వార్స్, అండర్‌వరల్డ్ రాజకీయాలు, అధికార పోరాటాల నేపథ్యంలో సాగనుంది. జితేంద్ర కుమార్, రవి కిషన్‌తో పాటు సొనాల్ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
Latest News