|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 03:58 PM
యంగ్ బ్యూటీ శ్రీ లీల త్వరలో రాబోతున్న 'మాస్ జాతర' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీ లీల తన కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకునే వ్యక్తి అందంగా లేకపోయినా, తనను అర్థం చేసుకునే, సినీ కెరీర్‌కు మద్దతిచ్చే, నిజాయితీపరుడైన వ్యక్తి అయితే చాలన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే తాను ప్రాధాన్యత ఇస్తానని, కేవలం గ్లామర్‌కే పరిమితం కాకూడదని కోరుకుంటానని వెల్లడించారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో శ్రీ లీల ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.
Latest News