|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 02:34 PM
మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి సోషల్‌మీడియా, వెబ్‌సైట్లలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ విషయం గమనించిన చిరంజీవి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కి ఫిర్యాదు చేసి, అనంతరం కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా డీప్‌ఫేక్ కంటెంట్ రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News