|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 02:31 PM
తెలుగు ఫోక్ డాన్సర్ గా ఓ మెరుపు మెరిసిన నాగదుర్గ ఇప్పుడు తమిళంలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ధనుష్ మేనల్లుడు పవీష్‌తో కలిసి ఆమె నటించనుంది. గతంలో 'కలివనం' అనే తెలుగు సినిమాలో నటించినా సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 9వ సీజన్‌లో పాల్గొంటుందన్న వార్తలు రూమర్స్‌గానే మిగిలిపోయాయి. గతంలో శాన్వి మేఘన, గౌరీప్రియ వంటి తెలుగమ్మాయిలు తమిళంలో అవకాశాలు దక్కించుకుని క్లిక్ అయ్యారు. అయితే, టాలీవుడ్‌లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా కనిపించడం లేదని తెలుగు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
Latest News