|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 04:54 PM
SS రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1 మరియు 2 ని మేకర్స్ 'బాహుబలి: ది ఎపిక్' అనే టైటిల్ తో అక్టోబరు 31, 2025న విడుదల చేస్తున్నారు. దర్శకుడు SS రాజమౌళి మరియు బృందం రిచ్ ఫార్మాట్‌లలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్య కృష్ణన్ మరియు సత్యరాజ్ ఉన్నారు. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆర్కా మీడియావర్క్స్ ఈ సినిమాని నిర్మించింది.
Latest News