|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:32 PM
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు, కేరళ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఏనుగు దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను శుక్రవారం కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు మోహన్‌లాల్‌కు జారీ చేసిన లైసెన్స్‌ను కూడా న్యాయస్థానం రద్దు చేసింది.చట్టపరమైన నిబంధనలను అనుసరించి ఈ వ్యవహారంపై కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2015లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో విధానపరమైన లోపాలు ఉన్నాయని, దానిని అధికారిక గెజిట్‌లో ప్రచురించలేదని, అందువల్ల అది చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. కాగా, ఈ తీర్పుపై మోహన్‌లాల్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఇది కేవలం "సాంకేతిక సమస్య" మాత్రమేనని పేర్కొన్నారు.
Latest News